SRCL: వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని మానేరు నది వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం పూర్తయ్యేంతే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.