SRPT: కోదాడ పట్టణంలోని తేజ ఫార్మసీ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఛైర్మన్ పందిరి నాగిరెడ్డి, కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడని, ప్రతి ఉపాధ్యాయుడు ఆయనని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.