TG: హైదరాబాద్‌లో కీలకమైన ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ‘వినాయక విగ్రహాల నిమజ్జనం నిరాటంకంగా కొనసాగుతోంది. చిన్న చిన్న శోభాయాత్రలను ప్రధాన విగ్రహాలతో కలుపుతున్నాం. నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు ఉన్నాయి. వాహనాలన్నీ రాత్రి 11లోగా ట్యాంక్‌బండ్‌కు చేరుకోవచ్చు’ అని వెల్లడించారు.