BHNG: బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో ఈదుల చెరువు, కాలువను శనివారం అధికారులు పరిశీలించారు. చెరువులకు, కాల్వలకు మరమ్మత్తులు చేపడుతామని తెలిపారు. కంప చెట్లను తొలగించి సమస్య పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు. ఈ పరిశీలనలో డీఈ హభిబ్ హుదిన్, ఇరిగేషన్ అధికారులు సాయి, మధు, రామయ్య పాల్గొన్నారు.