TG: హుస్సేన్ సాగర్‌లో.. ప్రసిద్ధ బాలాపూర్ గణేశ్ నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. క్రేన్ 12 వద్ద బాలాపూర్ గణపతిని నిమజ్జనం చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్‌కు భారీగా గణనాథులు, భక్తులు తరలివస్తున్నారు. సచివాలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.