MBNR: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం 2వ సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నవాబ్ పేట మండలంలోని 15 ఎంపీటీసీల స్థానాలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీవో జయరాం నాయక్ విడుదల చేశారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో ఈ నెల 8వ తేదీలోగా మండల పరిషత్ కార్యాలయంలో తెలియజేయాలని ఆయన కోరారు.