RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి శాలువాతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.