HNK: కాజీపేట మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి భవన నిర్మాణ రంగ కార్మికులు శనివారం సాయంత్రం పాలాభిషేకం నిర్వహించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాలకు అనుగుణంగా జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. కార్మికులకు అండగా నిలిచినందుకు పెద్దలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గబ్బెట ఎల్లేష్ పాల్గొన్నారు.