PPM: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లా ఆసుపత్రి నేత్ర వైద్య విభాగంలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ.. కార్నియల్ అంధత్వంతో చూపు కోల్పోయిన వారికి దాతల నుంచి సేకరించిన కార్నియా మార్పిడి ద్వారా కంటి చూపును ప్రసాదించవచ్చు అన్నారు.