RR: కొండాపూర్ పరిధిలోని ఆనంద్ నగర్, ప్రశాంత్ నగర్ కాలనీల్లో HMWSSB అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నేరుగా పైప్లైన్లకు అమర్చిన 22 వాటర్ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. మోటార్లు వాడితే జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నీటి సరఫరా సమస్యలు ఉంటే 155313 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.