BDK: అశ్వాపురం మండలంలోని శ్రీ సాయి బాబా ఆలయం భక్తుల సందడితో ఆదివారం ముస్తాబవుతోంది. శ్రీ శిర్డీ సాయి బాబా ఆరాధనలో భాగంగా 32 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఈ ఉత్సవాలకు ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.