KMM: మధిర మండలం వంగవీడు గ్రామంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో దీక్షిత(12) అనే విద్యార్థిని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో కలిసి బ్రిడ్జిని చూడటానికి వెళ్లిన ఆమె, నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. మృతురాలు జితేంద్ర కుమార్తెగా గుర్తించారు.