BDK: ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి మంగళవారం భద్రాచలం డిపోలో ‘ప్రగతి చక్ర’ అవార్డులను ప్రదానం చేశారు. ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా 56 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఈ పురస్కారాలు అందుకోగా, భద్రాచలం డిపో నుంచి 19 మంది ఎంపికయ్యారు. రీజనల్ మేనేజర్ సలీమ్ వారికి అవార్డులు అందజేశారు. సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని అధికారుల పిలుపునిచ్చారు.