MBNR: శ్రీరాముడి సద్గుణాలను అలవర్చుకుని యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్లోని బాలాజీనగర్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాముడు సత్యం, ధర్మం, బాధ్యతకు నిలువుటద్దమని, ఆయన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో విలువలు పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.