WGL: రెండు తెలుగు (తెలంగాణ, ఏపీ) రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్‌గా బత్తిని సురేష్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా 2 రాష్ట్రాల టాక్స్ బార్ అసోసియేషన్ బాధ్యులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాల గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు.