VKB: పరిగి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కొండల్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.