HYD: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ప్రకటించారు. దీని ద్వారా వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఎంపికైన వారికి కోర్సు ఫీజులో రూ. లక్ష వరకు రాయితీ కల్పిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.