MDK: తూప్రాన్ పట్టణంలో 5.30 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నట్లు పౌరసపరాల శాఖ ఇన్స్పెక్టర్ తాటి నరసింహులు తెలిపారు. శివంపేట మండలం రత్నాపూర్కు చెందిన గోకులోత్ అనిల్ కుమార్ రేషన్ కార్డు దారుల నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు పట్టుకున్నట్లు వివరించారు. బియ్యం, వాహనం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.