NZB: దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’.. వంటి అనేకానేక పంక్తులతో దాశరథి తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారని కవిత కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని తన కవితల ద్వారా ప్రజల్లో నింపిన గొప్ప కార్యశీలి దాశరథి అని ఆమె అన్నారు.