టెక్ కంపెనీల్లో అగ్రస్థానం సంపాదించాలంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఒక్కటే ఉంటే సరిపోదని గూగుల్ ఆండ్రాయిడ్ హెడ్ సమీర్ సమత్ వ్యాఖ్యానించారు. సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. దీనిపై అభిరుచి ఉందో.. చదువుకునే రోజుల్లోనే దానిపై పూర్తి పట్టు సాధించాలని సమీర్ చెప్పారు.