VZM: ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తుంతోందని, తల్లికి వందనం కూడా అందిస్తోందని , అయినప్పటికీ పిల్లలు బడి మానేయడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశమని కలెక్టర్ అంబేద్కర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల విద్యా శాఖాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు 9 వేల మంది డ్రాప్ ఔట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.