VZM: అర్హత ఉన్న వారందరికీ రుణాలను మంజూరు చేసి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించాలని MLA పూసపాటి అదితి విజయలక్ష్మి కోరారు. విజయనగరం నియోజకవర్గ బ్యాంకర్ల సమావేశం స్థానిక DRDA సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ప్రభుత్వ రుణ పథకాలను లబ్ది దారులకు చేరవేయుటలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని అధిగమిచడం పై చర్చించారు.