కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం సందర్శించారు. గ్రామంలో SSG 2025 (స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్) కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, అమలు ప్రక్రియను పరిశీలించారు. గ్రామస్తులతో, సచివాలయ సిబ్బందితో మట్లాడి, స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ ఇతర మౌలిక సదుపాయాలపై అధికారుల నుంచి నివేదికలను సమీక్షించారు.