NLG: యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే ఎరువుల దుకాణం యజమానితో పాటు, సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎరువులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఎరువుల ఫిర్యాదుల కేంద్రాన్ని”, టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ను ఆమె ప్రారంభించారు.