KMM: కూసుమంచి మండలం జీళ్ళచెరువు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. HYD నుండి ఖమ్మం వస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.