KMM: తడి, పొడి చెత్త సేకరణలో మున్సిపాలిటీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఖమ్మం మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లయ్య అన్నారు. మంగళవారం 26వ డివిజన్లో చెత్తను వేరు చేసే విధానం, వ్యర్ధాల రకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.