GNTR: చేబ్రోలు మండలం గుండవరం గ్రామ రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణానికి నిధుల కోసం గ్రామ ప్రజలు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను కలిశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డితో చర్చించి అధికారులతో సమన్వయం సాధించారు. ఫలితంగా సీజీఎఫ్ గ్రాంట్ కింద రూ. 44 లక్షలు మంజూరయ్యాయి.