GNT: శిక్షణ పూర్తి చేసుకున్న 53 మంది ప్రొబేషనరీ సివిల్ ఎస్సైలు మంగళవారం గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విధినిర్వహణలో నిబద్ధత,సేవా తపన, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపుదలపై ఐజీ సూచనలు అందించారు. ఈ ఎస్సైలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కేటాయించారు.