VKB: పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత అని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని గొట్ల చెలక తండా గ్రామపంచాయతీ పరిధిలో వనమహోత్సవ కార్య క్రమంలో భాగంగా మొక్కలను కాంగ్రెస్ నాయకులు నాటారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానికి సంరక్షణ కల్పించాలరు. పీఎసీఎస్ ఛైర్మన్ ఆగిరాల యాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.