W.G: రేషన్ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆకివీడులో సచివాలయం-1 పరిధిలోని 3 రేషన్ షాపులను తనిఖీ చేశారు. బియ్యం పంపిణీలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న వాటిలో ఈ షాపులు ఎంక్వైరీలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని తెలిపారు. తీరు మార్చుకోకపోతే డీలర్ షిప్ రద్దు చేస్తామన్నారు.