JGL: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ లో జరిగిన భూ తగాదాలలో ఒకరు మృతి చెందారు. మూలరాంపూర్ కు చెందిన గూడ గంగాధర్, గూడ రవి మధ్య ఈనెల 9న ఒడ్డు విషయంలో గొడవ జరగ్గా గంగాధర్ పారతో రవిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రవిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో గంగాధర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.