W.G: మద్యం అక్రమ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్ గుడాల గోపీ అన్నారు. మంగళవారం పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని ధ్వజమెత్తారు.