ATP: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 23న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు విద్యార్థులకు మహిళా చట్టాలు, హక్కులు, అంశంపై నిర్వహించే అవగాహన కార్యక్రమంలో శైలజ పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.