NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం నెల్లూరు చేరుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి. జి భరత్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలసి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థితిగతులను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు.