JN: మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా బుధవారం జనగామ RTC బస్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమాలు, సంబరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 2.26 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా.. ఆర్టీసీకి 108.97 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 9నుంచి పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు.