BDK: ఇల్లందు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూతనంగా నియమితులైన గ్రంధాలయ ఛైర్మన్ పసుపు లేటి వీరబాబు ఎమ్మెల్యే కోరం కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని దానికి ఉదాహరణ వీరబాబు అని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని ఆకాంక్షించారు.