GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి లోడ్‌తో వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లోడు లారీ తిరగబడటంతో పాటు ఎక్సెల్ వాహనదారుడుకి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు 108లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.