PDPL: పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో నియోజకవర్గం వ్యాప్తంగా 4847 మంది నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే విజయరమణరావు మంగళవారం పంపిణీ చేశారు. తెలంగాణలో చాలా కాలం తర్వాత ప్రజా ప్రభుత్వంలో అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తుందని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అధికారులు అర్హులైన పేదలను గుర్తించి కార్డులు అందించాలన్నారు.