HNK: వేలేరు మాజీ MPTC బత్తుల జ్యోతిపై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్రంగా ఖండించారు. వారిపై దాడి చేసింది కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. వేలూరులో ఇవాళ నిరసన, ధర్నా చేపట్టారు. లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.