GNTR: పొగాకు నిల్వలు తడిసి నష్టపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు డిమాండ్ చేశారు. మంగళవారం కాకుమాను మండలంలోని కొమ్మూరు, పెద్దివారిపాలెం, గార్లపాడు గ్రామాల్లోని పొగాకు మండెలు వద్ద సమస్యలు తెలుసుకున్నారు.