BDK: ఇల్లందు పట్టణంలో BRS శ్రేణుల ఆధ్వర్యంలో దాశరధి జయంతి నిర్వహించారు. దిండిగల రాజేందర్ మాట్లాడుతూ.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని అన్నారు. కవిగా,రచయితగా తన రచనలతో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరయుద్ధం సాగించిన వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్యులు అని కొనియాడారు.