E.G: రంగంపేట మండలం వడిసలేరులో రక్షిత మంచినీటి పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మెట్ట ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.