WGL: పర్వతగిరి మండలంలోని ZPHS పాఠశాలలో దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. సభాధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు పాక రమేష్ బాబు వ్యవహరించారు. ‘ఆ చల్లని సముద్ర గర్భం’ పాటపై విద్యార్థుల మధ్య పోటీలు నిర్వహించగా, ఏడవ తరగతి విద్యార్థిని పావనికి బహుమతి అందజేశారు. ఉపాధ్యాయులు డా. మడత భాస్కర్, బి. రేఖ తదితరులు పాల్గొన్నారు.