TG: శతజయంతి సందర్భంగా దాశరథి కృష్ణమాచార్యను మాజీ సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తన సాహిత్యం ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని చాటిన గొప్ప కవి దాశరథి అని పేర్కొన్నారు. దాశరథి జైలు గోడల నడుమ కూడా తెలంగాణ నినాదాన్ని వినిపించారన్నారు. తెలంగాణ గర్వించదగిన భూమిపుత్రుడు దాశరథి కృష్ణమాచార్య అని కొనియాడారు.