SRPT: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం నాగారం మండలం ఫణిగిరిలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళ్తుందన్నారు.