KDP: ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు సంపన్న కుటుంబాల వారు ముందుకు రావాలని పంచాయతీ కార్యదర్శి నాగమణి, సర్పంచ్ వెంకటసుబ్బయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు కాజీపేట మండలం భూమయ్యపల్లిలో మంగళవారం P4 సర్వేపై గ్రామసభ నిర్వహించారు. కాగా, 2047 నాటికి ఆర్థికంగా ప్రపంచంలో ఒకటవ స్థానంలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.