HYD: మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి, టీచర్స్ కాలనీలో 15 రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుంది. స్థానికులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యకు మోక్షం కలగలేదన్నారు. అధికారుల తీరుకు నిరసనగా అంబేద్కర్ నగర్ వాసులు మంగళవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తమ సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.