బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని 23వ వార్డు, వివేకానంద కాలనీలో ముఖ్యమైన డ్రైనేజీ పూడికతీత పనులను మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథ రెడ్డి మంగళవారం స్వయంగా పరిశీలించారు. ఆ ప్రాంత ప్రజలు గత 7-8 సంవత్సరాలుగా డ్రైనేజీ సరిగా శుభ్రం చేయకపోవడం, దుర్వాసనతో పాటు మురుగునీటి నిల్వతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు.