GNTR: మంగళగిరిలో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన మంగళవారం ఉండవల్లిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు మంగళగిరిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.