ప్రకాశం: పామూరు మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో సీఐ భీమా నాయక్ మంగళవారం విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా ఆకతాయిలు వెంటపడి వేధిస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని బాలికలకు సూచించారు. బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సీఐ సూచించారు.